Politics

ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధులు

What is MPTC ?
Mandal Parishad Territorial Constituency,

What is ZPTC ?
Zilla Parishad Territorial Constituency

DUTIES OF MPTC...

  • ఎంపీటీసీగా ఎన్నికైన వ్యక్తి మొదటి మూడు మండల పరిషత్ సమావేశాల్లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యత్వం రద్దవుతుంది.
  •  అలాగే వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోయినా నోటీసులు జారీచేసి సభ్యతాన్ని రద్దు చేస్తారు.
  •  మండల పరిషత్‌ను ప్రశ్నించే హక్కు వీరికి ఉంది.
  •  మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చు.
  •  గ్రామ అవసరాలను గుర్తించి నిధులు రాబట్టేందుకు ప్రతిపాదించవచ్చు.
  •  అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ప్రశ్నిం చడమే కాక విషయూన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
  •  తమ పరిధిలోని పాఠశాలలను పరిశీలించి విద్యా ప్రమాణాలు మెరుగుదలకు సూచనలు చేయవచ్చు.
  •  మండల పరిషత్ నిధులు సద్వినియోగం అయ్యేలా సూచించవచ్చు.
  •  ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతి నిధ్యం వహించే ప్రాదేశికం పరిధిలో అన్ని పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చు. సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. ఓటు హక్కు ఉండదు.
  •  మండల పరిషత్ నుంచి నిధులు తెచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయవచ్చు.
  •  మండలంలో ఎన్నికైన ఎంపీటీసీల్లో ఒక రిని మండల పరిషత్ అధ్యక్షుడి గానూ, మరొకరిని ఉపాధ్యక్షడిగా ఎన్నుకుంటారు.
  •  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి ఓటు హక్కు ఉంటుంది.

                                                   DUTIES OF ZPTC...

  • జడ్పీటీసీగా ఎన్నికైన వ్యక్తి వరుసగా మూడు జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకాక పోతే సభ్యత్వం రద్దవుతుంది.
  •  మండల పరిషత్ సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. జిల్లా పరిషత్‌లో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటారు.
  •  అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు మంజూరు చేయించవచ్చు. జిల్లా పరిషత్‌లో నిధుల కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు.
  •  జెడ్పీ నిధులు, విధులను ప్రశ్నించే హక్కు జెడ్పీటీసీ సభ్యుడికే ఉంటుంది.
  •  రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు.
  •  ప్రభుత్వం నుంచి తలసరి గ్రాంటు జిల్లా పరిషత్‌కు మంజూరవుతుంది. ఈ నిధులతో వారు ప్రాతినిధ్యం వహించే మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు.
  •  రాజకీయ కారణాలతో నిధుల కేటాయింపులో చైర్మన్ వివక్ష చూపితే ప్రశ్నించే హక్కు ఉంటుంది.
  •  మండల స్థాయిలో ఐసీడీఎస్, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరి శీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఆయా అంశాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
  •  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జడ్పీ టీసీ సభ్యునికి ఓటు హక్కు ఉంటుంది.


సీఎం వ్యాఖ్యలు బాధాకరం, ఎన్నికల వాయిదాకు కారణమిదే.. ఎస్‌ఈసీ రమేష్ వివరణ

YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విచారకరమన్నారు.

                 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిందని.. దీనిపై జాతీయ స్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే స్థానిక ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వెల్లడించారు. ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎస్‌ఈసీ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ఉపసంహరించినట్లు ప్రకటించిన తక్షణమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని ఎస్ఈసీ రమేష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కూడా ఎన్నికల నియమావళి పరిధిలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదన్నారు. ఎన్నికల్లో హింసపై అనేక పార్టీలు తమ దృష్టికి తీసుకొచ్చాయని తెలిపారు. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయన్నారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరని సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయని ఎస్ఈసీ ఆందోళన వ్యక్తం చేశారు.







No comments:

Post a Comment